Assam CM : ముస్లిం మ‌త గురువులకు సీఎం షాక్

మ‌సీదు, మ‌ద‌ర్సాల వివ‌రాలు కంప‌ల్స‌రీ

Assam CM : అస్సాం ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఇటీవ‌లే ప్ర‌పంచ ఉగ్ర‌వాద సంస్థ అల్ ఖైదా కు చెందిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఆ ఇద్ద‌రూ మత గురువులుగా చెలామ‌ణి కావ‌డం విశేషం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌సీదులు, మ‌ద‌ర్సాల‌లో ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రు త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని ఆదేశించారు రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గోల్ ప‌రా జిల్లాలో అరెస్ట్ అయిన ఇద్ద‌రు మ‌త పెద్ద‌లు రాష్ట్రంలోని ముస్లిం యువ‌కుల‌ను ఉగ్ర‌వాద చ‌ర్య‌ల వైపు మ‌ళ్లేలా చేశార‌ని , ఉగ్ర‌వాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు క‌లిగి ఉన్నారంటూ ఆరోపించారు.

అయితే ఈ నిబంధ‌న‌లు రాష్ట్రానికి చెందిన మ‌త గురువుల‌కు వ‌ర్తించ‌ద‌ని, కానీ ఇత‌ర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వ‌చ్చే మ‌త గురువులు, ముస్లింల‌కు చెందిన వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇందుకు సంబంధించి మ‌త గురువులు రాష్ట్రం వెలుప‌ల నుండి వ‌చ్చిన‌ట్ల‌యితే ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లో న‌మోదు చేసుకోవాల్సిందేనంటూ పేర్కొన్నారు.

లేక పోతే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌(Assam CM). ఇదిలా ఉండ‌గా అరెస్ట్ అయిన వారిలో ఒక‌రు మ‌సీదులో ఇమామ్ గా ప‌ని చేసిన కింగ్ పిన్. జిహాదీ నెట్ వ‌ర్క్ ను చాలా గ్రామాల్లో విస్త‌రించాడు.

ఆరుగురు బంగ్లాదేశ్ జాతీయులు అస్సాంలోకి ప్ర‌వేశించారు. వీరిలో ఒక‌రు అరెస్ట్ కాగా మ‌రో ఐదుగురు ప‌రారీలో ఉన్నారు. ఎవ‌రు గ్రామాల్లోకి వ‌చ్చినా ముందు పోలీస్ స్టేష‌న్ లో న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు సిఎం.

Also Read : బిల్కిస్ బానోకు పంజాబ్ గాయ‌కుడి భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!