CM Siddaramaiah : లా అండ్ ఆర్డర్ కు ఢోకా లేదు – సీఎం
సిద్దరామయ్య కీలక ప్రకటన
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందన్నారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఖండించారు. జైనముని కామకుమార్ నంది మహారాజజ్ హత్య కేవలం డబ్బు, వ్యాపారం కారణంగా జరిగిందన్నారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కేవలం 6 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారని చెప్పారు సీఎం.
దీంతో పాటు వ్యక్తిగత శత్రుత్వం కారణంగా టి. నరసీపూర్ కు చెందిన వేణుగోపాల్ ను హత్య చేసిన నిందితులను 24 గంటల్లోపే అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. బెంగళూరు ఏరోనిక్స్ మేనేజింగ్ డైరెక్ట్ , సిఇవోలను హత్య చేసిన నిందితులను హత్య జరిగిన 23 గంటల్లో పే అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah). రాష్ట్ర పోలీసు శాఖ ఈ కేసును పూర్తిగా విచారిస్తుందని, దోషులకు గరిష్టంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
హత్యలు, కిడ్నాప్ లు వంటి నేర పూరిత చర్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ పరంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పేలా చేయడం తమ తొలి ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేశారు సీఎం.
Also Read : V Srinivas Goud : రేవంత్ నోరు అదుపులో పెట్టుకో