CM Siddaramaiah : సాహిత్యం స‌జీవం – సిద్ద‌రామ‌య్య‌

క‌వులు..ర‌చ‌యిత‌లు ఫోక‌స్ పెట్టాలి

CM Siddaramaiah : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాహిత్యం లేక పోతే జీవితం లేద‌న్నారు. దానికి ప్రారంభమే త‌ప్పా ముగింపు అంటూ ఉండ‌ద‌న్నారు. ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా చ‌ద‌వ‌కుండా ఆ స్థాయికి రాలేర‌న్నారు సిద్ద‌రామ‌య్య‌. శ‌నివారం క‌ర్ణాట‌క క‌న్న‌డ ర‌చ‌యిత‌లు, ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో గాంధీ భ‌వ‌న్ లో 20వ వార్షికోత్స‌వం, పుర‌స్కార ప్ర‌దానోత్స‌వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్బంగా క‌ర్ణాట‌కలోని సాహిత్య రంగానికి చెందిన క‌వులు, ర‌చ‌యిత‌లు, ప్ర‌ముఖుల‌ను స‌త్క‌రించి ఘ‌నంగా స‌న్మానించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌(CM Siddaramaiah). ఈ సంద‌ర్బంగా పాల్గొన్న సాహితీ పిపాస‌కులు సీఎం సిద్ద‌రామ‌య్య‌ను స‌త్క‌రించ‌డం విశేషం.

ఈ సంద‌ర్బంగా సాహితీ ప్రియులను ప్ర‌త్యేకంగా అభినందించారు సిద్ద‌రామ‌య్య‌. క‌వులు, క‌ళాకారులు, సాహితీవేత్త‌లు స‌మాజానికి దిక్సూచీలు అని అన్నారు. త‌మ ప్రభుత్వం సాహిత్య రంగానికి విశేష‌మైన కృషి చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. స‌మాజ హితం కోరేలా , ప్ర‌జ‌ల‌ను ఆలోచింప చేసేలా, ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని వెలుగులోకి తీసుకు వ‌చ్చేలా ర‌చ‌న‌లు చేయాల‌ని సూచించారు.

మున్ముందు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా గ‌త కొంత కాలంగా భాష పై దాడి జ‌రుగుతోంద‌ని దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు సిద్ద‌రామ‌య్య‌.

Also Read : Manik Rao Thakeray : బీఆర్ఎస్ బీజేపీ ఒక్క‌టే – ఠాక్రే

 

Leave A Reply

Your Email Id will not be published!