CM Yogi Adityanath : జయహో రామభద్రాచార్యా – యోగి
ఆయన చేసిన కృషి ప్రశంసనీయం
CM Yogi Adityanath : రామ జన్మ భూమి కేసులో రామ భద్రాచార్య కు వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) శ్రీ రామభద్రాచార్య జీ మహరాజ్ గురించి వివరించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్క హిందువు మహరాజ్ వెనుక శక్తి ఏమిటో గుర్తించాలన్నారు. 3 ఏళ్లప్పుడు పద్యం రాశాడు. 5 ఏళ్ల వయసులో శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేశారని తెలిపారు. 7 ఏళ్ల వయస్సులో 60 రోజుల్లో 10 వేల 900 శ్లోకాలు, శ్రీ రామ చరిత్ మానస్ లోని శ్లోకాలను కంఠస్థం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.
బాల గిరిధర్ ఇవాళ జగద్గురువు శ్రీ రామభద్రాచార్య జీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1950 జనవరి 14న మకర సంక్రాంతి రోజున చిత్రకూట్ లో పుట్టారు. 2 నెలల వయసులో అంధుడిగా మారారు. 22 భాషలలో మాట్లాడగలడు. 100కి పైగా పుస్తకాలు, 50కి పైగా పరిశోధనా పత్రాలు రాశాడు.
రామజన్మభూమి కేసులో బాబర్ రామ మందిరాన్ని కూల్చి వేస్తే తులసీ దాస్ ఎందుకు ప్రస్తావించ లేదంటూ ముస్లిం పక్షం ప్రశ్నించినప్పుడు ఆధారాలతో సహా వాదించాడు బాల గిరిధర్ మహరాజ్. ఆయన ఆధ్యాత్మిక నాయకుడు, ఉపాధ్యాయుడు, సంస్కృత పండితుడు, కవి, తత్వవేత్త, గీత రచయిత, గాయకు, సాహితీవేత్త అని తెలిపారు. 1988న కాశీ విద్వత్ పరిషత్ ఆయనకు రాంభద్రాచార్య బిరుదు ఇచ్చింది.
Also Read : MP Soyam Bapurao : ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇల్లు కట్టుకున్నా
