YS Jagan : 27న రూ. 6,594 కోట్లు అమ్మ ఒడి ఖాతాల్లో జ‌మ‌

ప్ర‌క‌టించిన ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

YS Jagan :  ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 27న అమ్మ ఒడి కింద రూ. 6,594. 60 కోట్ల రూపాయ‌లు ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

స‌చివాల‌యంలో సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. 43.96 ల‌క్ష‌ల మంది త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌న్నారు. దీని వ‌ల్ల రాష్ట్రంలోని 82.31 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ది చేకూరుతుంద‌ని చెప్పారు సీఎం.

అంతే కాకుండా రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో 3,500 పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించారు. వ‌చ్చే నెల‌ల్లో విద్యా కానుక‌, వాహ‌న మిత్ర‌, కాపు నేస్తం , జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు.

అర్హులైన ఉండి గతంలో సంక్షేమ ఫ‌లాలు ద‌క్కని వారికి జూలై 19న తిరిగి అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). గండి కోట ఇంటిగ్రేటెడ్ ప‌ర్యాట‌క ప్రాజెక్టుకు 1,169 ఎక‌రాలు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు.

వంశధార నిర్వాసితుల‌కు అద‌నంగా మ‌రో రూ. 216. 71 కోట్లు ప‌రిహారంగా చెల్లిస్తామ‌ని చెప్పారు సీఎం. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రి చెల్లు బోయిన వేణు గోపాల‌కృష్ణ వెల్ల‌డించారు.

నాణ్య‌మైన విద్య అందించేందుకు గాను బైజూస్ తో ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలిపారు. పిల్ల‌ల‌కు ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ , ట్యాబ్ లు కూడా ఇస్తామ‌న్నారు. ఇందు కోసం రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేస్తామ‌న్నారు.

యూనివ‌ర్శిటీలు, కార్పొరేష‌న్, సొసైటీ ఉద్యోగుల‌కు పీఆర్సీ వ‌ర్తింప చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే మెడిక‌ల్ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 706 పోస్టుల చొప్పున మొత్తం 3,530 పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది. వైద్య విధాన ప‌రిష‌త్ కు కూడా 2,558 పోస్టులు మంజూరు చేసింది.

Also Read : ద్రౌప‌ది ముర్ముకే జైకొట్టిన జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!