YS Jagan : ఉగాదిన కొత్త జిల్లాల‌కు ముహూర్తం

ప్రారంభించ‌నున్న ఏపీ సీఎం జ‌గ‌న్

YS Jagan : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌నా ప‌రంగా దూసుకు పోతున్నారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ప‌రుగులు పెట్టిస్తున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ఐటీ , మ‌హిళా సాధికార‌త‌పై ఎక్కువ ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు సీఎం.

అధికార వికేంద్రీక‌ర‌ణ వైపు మొగ్గు చూపారు. ఈ మేర‌కు ఉన్న జిల్లాల‌కు వెసులుబాటు ఇస్తూ కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు . ఈమేర‌కు అసెంబ్లీ వేదిక‌గా కొత్త జిల్లాల ఏర్పాటును ప్ర‌క‌టించారు.

ఇందుకు ఏపీ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అంశం కొలిక్కి వ‌స్తోంది. ఇక వారం రోజుల్లో తుది నోటిఫికేష‌న్ రానుంది.

అన్ని జిల్లా కేంద్రాల‌లో ఇప్ప‌టికే అధికారులు కార్యాయాల‌ను, ఇత‌ర వ‌న‌రుల‌ను గుర్తించారు. కొత్త‌గా ఏపీలో ఏర్పాటు కాబోయే 13 జిల్లాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) ఉగాది పర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 2న లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

ఇందులో భాగంగా కొత్త జిల్లాల‌కు క‌లెక్ట‌ర్, ఒక జేసీతో పాటు ఎస్పీని ప్ర‌భుత్వం నియ‌మించ‌నుంది. ఈ మేర‌కు సీఎస్ ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మరింత త్వ‌ర‌గా వేగంగా ప‌నులు పూర్త‌య్యే అవకాశం క‌లుగుతుంది.

దీని వ‌ల్ల ఎలాంటి జాప్యం అన్న‌ది జ‌ర‌గ‌దు. ఇందులో భాగంగా జిల్లాలతో పాటు కొత్త గా రెవిన్యూ డివిజ‌న్లు కూడా పెరగ‌నున్నాయి. పోలీస్ శాఖ‌లో కూడా సంస్క‌ర‌ణ‌లు చోటు చేసుకోనున్నాయి.

Also Read : స‌భాసంఘం ఏర్పాటుతో ఏపీలో పెగాస‌స్ రచ్చ రంబోలా

Leave A Reply

Your Email Id will not be published!