YS Jagan : గ్యాస్ లేకేజీపై సీఎం జ‌గ‌న్ ఆరా

బాధితుల‌కు వైద్య సాయానికి ఆదేశం

YS Jagan : ఏపీలోని విశాఖ‌ప‌ట్నం స‌మీపం లోని అచ్యుతాపురంలో శుక్ర‌వారం అమ్మోనియా గ్యాస్ లీకే అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) ఆరా తీశారు.

ఉన్నాతాధికారుల‌ను వెంట‌నే త‌న‌కు వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా గ్యాస్ లీకేజీ ఎలా జ‌రిగింది, దానికి గ‌ల కార‌ణాల‌ను సిఎంఓ ఉన్నాధికారులు సీఎంకు వివ‌రించారు.

సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ వెళ్లి స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. లీకైన గ్యాస్ ను నియంత్రణ‌లోకి వ‌చ్చింద‌ని తెలిపారు.

ఇదిలా ఉండగా బ్రాండిక్స్ లో ఒక యూనిట్ లో ప‌ని చేస్తున్న మ‌హిళ‌ల‌ను అంతా ఖాళీ చేయించారు. అస్వ‌స్థ‌త‌కు లోనైన వారిని వెంట‌నే ప్ర‌ధాన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్య స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి.

అంతా కోలుకుంటున్నార‌ని ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) కి వివ‌రించారు. కాగా అమ్మోనియా గ్యాస్ ఎక్క‌డి నుంచి లీకైంద‌న్న అంశంపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌న్నారు.

దీనికి సంబంధించి ఇంకా వివ‌రాలు రావాల్సి ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికి మ‌రింత మెరుగైన వైద్య స‌హాయం అందించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు సీఎం.

ఎప్ప‌టిక‌ప్పుడు వారి క్షేమ స‌మాచారం గురించి త‌న‌కు తెలియ చేయాల‌న్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల గురించి ద‌ర్యాప్తు చేసి, భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం జ‌ర‌గ‌కుండా చూడాలని సీఎం ఆదేశించారు.

కాగా సీఎం ఆదేశాల మేర‌కు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Also Read : అమిత్ షాతో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!