CM YS Jagan : పని తీరుకు పట్టం మార్చుకోక పోతే కష్టం
కీలక నేతలకు సీఎం జగన్ ఝలక్
CM YS Jagan : తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. ఇక ఏపీలో సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. ఆయన ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, మంత్రుల పనితీరు గురించి ఆరా తీస్తున్నారు.
ఏ మాత్రం తేడా వచ్చినా సహించేది లేదంటున్నారు. ఇప్పటికే ఆయా నియోకజక వర్గాల వారీగా పనితీరుపై ఓ అంచనాకు వచ్చారు. వారికి సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదా అని చూడాల్సిన బాధ్యత నియోజకవర్గాల బాధ్యులపై ఉందని స్పష్టం చేశారు.
తన వద్ద ఎవరు బాగా పని చేస్తున్నారో లిస్టు ఉందని ఇప్పటికే వెల్లడించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ పదవులు కాపాడు కోవాలంటే కచ్చితంగా ప్రజల మధ్యనే ఉండాలని నేతలంతా వారితో ఉంటున్నారు. అంతే కాకుండా సీఎం(CM YS Jagan) గడప గడప అనే పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి గడపకు ఎమ్మెల్యేలు వెళ్లాల్సి ఉంటుంది. వారికి ఇంకా ఏం కావాలి. ఏమేం అందలేదనే విషయం తెలుసు కోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత దాకా ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బిగ్ టాస్క్ ముందుంచారు. ఇందులో భాగంగా కీలక సమావేశం నిర్వహించారు.
పని తీరు మెరుగు పడని నేతలకు సీఎం లాస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది 2023 మార్చి వరకు డెడ్ లైన్ విధించినట్లు టాక్.
Also Read : జగన్ కేసీఆర్ నాటకం సెంటిమెంట్ రాజకీయం