CM YS Jagan : గెలుపు ఖాయం మాదే రాజ్యం

ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ రెడ్డి

CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకునే బాధ్య‌త త‌న‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోసారి ఏపీలో వైసీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా వ‌దులుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు విజ‌యం సాధించేలా తాను ముందుండి న‌డిపిస్తానంటూ పేర్కొన్నారు ఏపీ సీఎం.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని బీరాలు పోతోందంటూ తెలుగుదేశం పార్టీపై ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు ఏకమైనా త‌న‌ను ఎదుర్కొనే ద‌మ్ము వారికి లేద‌న్నారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని మ‌రోసారి కుండ బంద్ద‌లు కొట్టారు జ‌గ‌న్ రెడ్డి. ఇవాళ ప్ర‌తి రంగానికి చెందిన వారికి ప్ర‌భుత్వ ఫ‌లాలు అందేలా చూశామ‌ని చెప్పారు.

సోమ‌వారం ఏపీ సీఎం ఎమ్మెల్యేల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై క్లారిటీ ఇచ్చారు. ఒక ర‌కంగా వారికి దిశా నిర్దేశం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan).

రాష్ట్రంలో 21 స్థానాల‌కు గాను 17 స్థానాల‌ను వైసీపీ గెలిచింద‌ని కానీ వాళ్లు ఉన్న‌ది లేన‌ట్టుగా ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. రాష్ట్రంలోని 87 శాతం యూనియ‌న్లు త‌మ‌తోనే ఉన్నాయ‌ని వెల్ల‌డించారు సీఎం. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ కూడ‌ద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు జ‌గ‌న్ రెడ్డి. గ‌డప గ‌డ‌ప కార్య‌క్ర‌మం త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. ఇక సెప్టెంబ‌ర్ నుంచి కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం(CM YS Jagan).

Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పై .. కేంద్రానికి కేటీఆర్ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!