YS Jagan Modi : ప్రధానితో ముగిసిన సీఎం జగన్ భేటీ
45 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చ
YS Jagan Modi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Modi) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గురువారం సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య 45 నిమిషాలకు పైగా సమావేశం జరిగింది.
ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా సీఎం ప్రధానితో చర్చించారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డి ఉన్నారు.
అనంతరం జగన్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అంతకు ముందు ఢిల్లీకి చేరుకున్న సీఎంకు వైఎస్సార్ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. అంతకు ముందు సీఎం(YS Jagan Modi) దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అక్కడ పలు కంపెనీలకు చెందిన వారితో సమావేశం అయ్యారు.
అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నారు. భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
ఇదే సమయంలో తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం జగన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు.
అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నేను అభిమానించే నా సోదరుడిని కలుసు కోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వీరిద్దరూ ఏపీకి, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు.
Also Read : టీడీపీకి మంగళం బాబుపై ఆగ్రహం