YS Jagan : జగన్ సంకల్పం రైతుల సంక్షేమం
తక్కువ వడ్డీకే రైతన్నలకు రుణాలు
YS Jagan : తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) . దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రధానంగా ఆర్బీకే సెంటర్లు ఇవాళ ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చి రుణాలకు గ్యారెంటీ ఇస్తోందన్నారు.
అత్యంత తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని సూచించారు సీఎం.
ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు ఆసరా ఏర్పడుతుందన్నారు. మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకే ( లబ్దిదారులు) నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
దీంతో ఒక్క పైసా బయటకు వెళ్లే ప్రసక్తి ఉండదన్నారు. మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లను తగ్గించాలని కోరారు సీఎం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan).
హార్బర్లు, పోర్టుల నిర్మాణానికి ఆసరా ఇవ్వాలన్నారు. సీఎం తన క్యాంపు ఆఫీసులో 219 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రూ. 3, 19, 480 కోట్లతో 2022-23 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, డ్రోన్లను కూడా ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నట్లు తెలిపారు.
దీని వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. కాగా డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని సూచించారు సీఎం.
Also Read : సంక్షేమ పథకాల అమలులో ఏపీ టాప్