CMR College : మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన
సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు...
CMR College : మేడ్చల్ సీఎంఆర్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. టాయిలెట్‌లో వీడియో రికార్డింగ్ చేయడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
CMR College Incident
సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. హాస్టల్ కుక్‌లపై అనుమానం వచ్చి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : AP Cabinet Meeting : కీలక అంశాలపై చర్చకు నేడే ఏపీ క్యాబినెట్ మీటింగ్