Modi Birthday : ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

మరోవైపు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు...

Modi : ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధానమంత్రి మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మంచి ఆరోగ్యంతో పాటు దేశ సేవలో దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ గౌరవనీయులైన ప్రధాన మంత్రి జన్మదిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశాన్ని పురోగతి, శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు ఆరోగ్యం, మనోబలం సిద్దించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా స్పందించారు.

Modi Birthday Wishes from Telugu CM’s..

మరోవైపు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. స్పూర్తిదాయకమైన ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి, ఆధునిక భారతదేశ రూపశిల్పి, గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రత్యేకమైన ఈ రోజున మీరు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, నిరంతర శక్తిని పొందాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశం శాంతి, శ్రేయస్సు, ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది. శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో మీ నాయకత్వం ద్వారా భారతదేశాన్ని విశ్వ గురువుగా స్థానాన్ని తిరిగి పొందాలి. అందుకు మీరు మార్గనిర్దేశం చేస్తారని విశ్వసిస్తున్నాను. ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ సర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read : Delhi CM : ఢిల్లీ నయా సీఎం పేరును ప్రతిపాదించిన ఆప్ అధినేత కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!