Lachit Borphukan : పోరాట యోధుడు లచిత్ బర్పుకాన్
ప్రధానమంత్రి ప్రశంసలతో ముంచెత్తారు
Lachit Borphukan : దేశ ప్రధానమంత్రి ఇవాళ లచిత్ బర్పుకాన్ కు నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో కొందరికే స్థానం లభించిందని , మిగతా వాళ్లకు చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. ఇంతకీ అస్సాంకు చెందిన ఈ యోధుడు ఎవరు. ఎందుకని లచిత్ బర్పుకాన్ ను ఇన్నేళ్లయినా తలుచుకుంటున్నారో తెలుసు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.
ఎందుకంటే మనుషులు ఉంటారు పోతారు. కానీ చరిత్ర, కాలం అలాగే ఉంటాయి. అస్సాంకు చెందిన యుద్ద వీరుడు. జనరల్ లచిత్ బర్పుకాన్ 400వ పుట్టిన రోజు ఇవాళ. నవంబర్ 25న ప్రతి ఏటా ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఇవాళ ప్రధానమంత్రి లచిత్ బర్పుకాన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
లచిత్ బర్పుకాన్(Lachit Borphukan) 17వ శాతబ్ద కాలంలో అహోం దళాల కమాండర్. అస్సాంను స్వాధీనం చేసుకునేందుకు మొఘలులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. 1671లో సరైఘాట్ యుద్దంలో అతడు అద్భుతమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాడని చరిత్ర చెబుతోంది. అస్సాం చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా కీర్తిస్తున్నారు.
నవంబర్ 24 , 1622న పుట్టాడు. అస్సాంలోని అహోం రాజ్యానికి సంబంధించిన రాయల్ ఆర్మీ జనరల్. మొఘలులను ఓడించాడు. ఔరంగాజేబు ఆశయాలకు అడ్డుకట్ట వేశాడు. అస్సామీ సైనికులను ప్రేరేపించాడు. దీంతో మొఘలులు తలవంచక తప్పలేదు. ఇదిలా ఉండగా లచిత్ బర్పుకాన్ ,
ఆయన సైన్యం విరోచిత పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఇలాంటి వారు ఎందరో దేశంలో ఉన్నారు. ఆనాటి మొఘలుల పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
Also Read : కావాలనే చరిత్రను వక్రీకరించారు – మోదీ