Robert Vadra : ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)సంచలన కామెంట్స్ చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు.
ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన ఆయన ఇవాల్టి వరకు తెర వెనుక మాత్రమే ఉన్నారు. కానీ ఇక నుంచి తాను కూడా పాలిటిక్స్ లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. మోదీ కొలువు తీరిన వెంటనే రాబర్ట్ వాద్రాను ఇరికించే ప్రయత్నం చేశారు.
ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపాయి. వ్యక్తిగతంగానో లేదా సంస్థగానో ఉండడం వల్ల బలమైన బీజేపీని తాను ఢీకొనలేనని పేర్కొన్నాడు.
ప్రత్యక్షంగా పోరాటం చేయాలన్నా లేదా ఎదుర్కోవాలన్నా ఒక్కటే మార్గం తాను పవర్ పాలిటిక్స్ లోకి ఎంటర్ కావడమేనని పేర్కొన్నాడు రాబర్ట్ వాద్రా(Robert Vadra). ఇప్పటి దాకా ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు.
ఆయన ప్రియాంక గాంధీని పెళ్లి చేసుకున్నాక అప్పట్లోనే పాలిటిక్స్ లోకి వస్తారని అనుకున్నారంతా. కానీ తెర వెనుక నుంచి చక్రం తిప్పారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైతా ప్రజల్లోకి వెళ్లడం, వారికి దగ్గరగా ఉంటూ ప్రజా సేవ చేయొచ్చన్నది తన అభిమతమని చెప్పారు.
ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. యూపీ ఎన్నికల్ని తన భుజాలపై మోశారు.
Also Read : ‘పన్నీరు..ఇలవరసి’ పరేషాన్