Sapthagiri Salaar : స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం – స‌ప్త‌గిరి

క‌మెడియ‌న్ షాకింగ్ కామెంట్స్

Sapthagiri Salaar : డైన‌మిక డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ , శృతీ హాస‌న్ క‌లిసి న‌టిస్తున్న స‌లార్ చిత్రం త్వ‌ర‌లో రానుంది. తాజాగా స‌లార్ టీజ‌ర్ విడుద‌లైంది. పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది ఈ పాట‌కు. స‌లార్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి. ఆద‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు.

స‌లార్ చిత్రంలో త‌న పాత్ర‌కు సంబంధించి డ‌బ్బింగ్ పూర్తి చేశాన‌ని వెల్ల‌డించాడు. ఇది త‌ప్ప‌క డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పేర్కొన్నారు క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి(Sapthagiri). స‌లార్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 2,000 కోట్ల మార్కును త‌ప్ప‌కుడా అధిగ‌మిస్తుంద‌ని తెలిపాడు. త‌న‌కు సినిమాలో అవ‌కాశం ఇప్పించిన డార్లింగ్ ప్ర‌భాస్ కు , ఛాన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కు రుణ‌ప‌డి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌కుడు నీల్ ఇప్ప‌టికే మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు. అంతే కాదు క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ తో కేజీఎఫ్ తీశాడు. అది సూప‌ర్ , బంప‌ర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెన్స్ గా కేజీఎఫ్ -2 తీశాడు. అది ఊహించ‌ని రీతిలో కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో స‌లార్ కు ప్లాన్ చేశాడు.

Also Read : Jailer Kaavaala Song : త‌లైవా జైల‌ర్ సాంగ్ రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!