Telangana Chief Justice : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డు గా పని చేస్తున్న ఆష్రఫ్ అలీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు.
ఆయన చేస్తున్న ఉద్యోగం చిన్నదే అయినప్పటికీ నిరంతరం క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. అదే దారిలో హైకోర్టు కూడా ఉంది. ప్రతి రోజూ కేసుల నిమిత్రం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శర్మ (Telangana Chief Justice)చూస్తూ ఉన్నారు.
శుక్రవారం అనుకోకుండా ఆయన తన ప్రోటోకాల్ ను పక్కన పెట్టారు. రహదారిపై విధులు నిర్వహిస్తున్న హోం గార్డు ఆష్రఫ్ అలీని చూసి తన కారును ఆపారు.
వెంటనే కిందకు దిగి గులాబీలతో కూడిన పుష్ప గుచ్ఛాన్ని తనకు గౌరవ వందనం చేసిన సదరు హోంగార్డు ఆష్రఫ్ అలీ చేతిలో పెట్టారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలీని అభినందించారు. నీలాంటి వాళ్లు ఉండడం పోలీసు శాఖకు గర్వ కారణమని, ఇలాంటి వృత్తి పరమైన నిబద్దత ప్రతి ఒక్కరు ఉండాలని , కనబర్చాలని సూచించారు.
ప్రస్తుతం జడ్జి శర్మ(Telangana Chief Justice) హోంగార్డును అభినందించిన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. ప్రస్తుతం అలీ కనబరుస్తున్న వృత్తి పట్ల నిబద్దత, అంకిత భావాన్ని చూసి నెటిజన్లు , తెలంగాణ వాసులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
అంతే కాదు హోంగార్డును అభినందించిన ప్రధాన న్యాయమూర్తి శర్మను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు శాఖతో పాటు ఇతరులు ఆష్రఫ్ అలీని అభినందిస్తున్నారు.
Also Read : తమిళిసై సంచలన కామెంట్స్