Computer Baba Jodo Yatra : రాహుల్ యాత్రలో కంప్యూటర్ బాబా
మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న జోడో యాత్ర
Computer Baba Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. రాహుల్ యాత్రలో బాబాలు కూడా చేరుతున్నారు. భారత్ జోడో యాత్ర మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది.
దేశంలోని పేరొందిన బాబాల్లో ఒకరైన కంప్యూటర్ బాబా(Computer Bab) కూడా చేరి పోయారు. ఈ అరుదైన సన్నివేశం శనివారం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా దేశం ఐక్యంగా ఉండాలని ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అనే నినాదంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ను గత సెప్టెంబర్ 7న తమిళనాడులోన కన్యాకుమారి నుంచి ప్రారంభించారు.
అక్కడి నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో ముగిసింది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా కంప్యూటర్ బాబాగా పేరొందారు నామ్ దేవ్ దాస్ త్యాగి. ఆయన రాహుల్ తో కలిసి నడిచారు. చాలా సేపు వివిధ అంశాల గురించి మాట్లాడారు.
ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం కమల్ నాథ్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ బాబా (Computer Baba) పాదయాత్రలో పాల్గొనడం విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ శ్రేణులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇదిలా ఉండగా కంప్యూటర్ బాబా తెల్లటి దుస్తులు ధరించారు. నుదుటి మీద పెద్ద బొట్టు పెట్టారు. త్యాగి భారతీయ హిందూ సన్యాసి. పర్యావరణవేత్త. గతంలో 2018లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆయనకు మంత్రి హోదాను కూడా ఇచ్చింది. కాగా ఇవాళ ఉదయం మధ్య ప్రదేశ్ లోని మహుదియా నుంచి పార్టీ యాత్ర ప్రారంభమైంది.
Also Read : రాహుల్ గాంధీకి కర్ణాటక హైకోర్టు నోటీసు