WEB 3.0 Conference : హైదరాబాద్ లో వెబ్ 3.0 పై సదస్సు
హెచ్ఐసీసీలో 3,4 తేదీలలో మీటింగ్
WEB 3.0 Conference : ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో మారుతోంది. ఐటీ పరంగా ప్రపంచంలోనే టాప్ కంపెనీలు హైదరాబాద్ లో కొలువు తీరాయి. ఇందులో గూగుల్, మైక్రో సాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ , అడోబ్ , కాప్ జెమిని, కాగ్నిజెంట్ , ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది కంపెనీలు కొలువు తీరాయి. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలన్నీ ఏర్పాటు అయ్యాయి.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. తాజాగా కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీ లో కీలక పాత్ర పోషించనుంది వెబ్ 3.0 పేరొందింది(WEB 3.0 Conference). దీనిపై వచ్చే నెల నవంబర్ 3, 4 తేదీలలో హెచ్ఐసీసీలో జాతీయ సదస్సును చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో మెటావర్స్ , ఆర్ట్ గ్యాలరీస్ , బిజినెస్ ఆఫీసెస్ , గేమ్స్ , కాసినోస్, మ్యూజిక్ వెన్యూస్, పేమెంట్ నెటవర్స్ , డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ , తదితర అత్యాధునిక సవేలను కొత్తగా రాబోతున్న వెబ్ 3.0 వేదికగా పొందేందుకు వీలు కలుగుతుంది.
కొన్నేళ్ల నుంచి ఇంటర్నెట్ వేదికగా వెబ్ బ్రౌజింగ్ లు కొత్తగా వచ్చాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ , గూగుల్ క్రోమ్ , ఫారెక్స్ ఇలా చాలా వచ్చాయి. కానీ ప్రస్తుతం గూగుల్ క్రోమ్ టాప్ లో ఉంది. కొత్తగా వెబ్ 3.0 రంగంలోకి రానుంది.
ఈ వెబ్ 3.0 లో కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , బ్లాక్ చైన్ తదితర టెక్నాలజీను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
Also Read : జీఎస్టీ తగ్గించాలంటూ కేటీఆర్ డిమాండ్