Abhishekh Rao : అభిషేక్ రావు అరెస్ట్ తో కలకలం
టీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు..?
Abhishekh Rao : ఢిల్లీ మద్యం స్కాం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ చుట్టూ తిరగడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. దీనిపై విచారణకు ఆదేశించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఇందులో భాగంగా రంగంలోకి దిగింది సీబీఐ.
మనీ ల్యాండరింగ్ జరిగిందని భావించిన ఈడీ సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలలో సోదాలు చేపట్టాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. తాజాగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ, ఎంపీకి దగ్గరగా ఉన్నారని భావించిన వెన్నమనేని శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకుంది.
ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కవితకు దగ్గరి వాడుగా గుర్తింపు పొందిన బోయినపల్లి అభిషేక్ రావును(Abhishekh Rao) ఇవాళ సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయన ఓ మీడియా సంస్థకు కోట్ల రూపాయలు జమ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. దేశంలోని 17 రాష్ట్రాలలో సోదాలు చేపట్టింది. సీబీఐ దూకుడు పెంచింది.
ఇప్పటి వరకు విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా అభిషేక్ రావును అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఆయనను ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఇతడికి టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అభిషేక్ రావు రాబిన్ డిస్టలరీలో డైరెక్టర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా అనూస్ బ్యూటీపార్లర్ లోనే డిస్టలరీస్ నడిపిస్తున్నట్లు గుర్తించింది సీబీఐ. మొత్తం మీద తీగ లాగితే డొంకంతా కదులుతోంది. రేపో మాపో డిప్యూటీ సీఎం సిసోడియాను కూడా అరెస్ట్ చేసే చాన్స్ లేక పోలేదు.
Also Read : కాంట్రాక్టు కోసం బీజేపీ తీర్థం