Congress 2nd List : రెండో జాబితాపై కాంగ్రెస్ ఫోకస్
నాలుగు సీట్లు వామపక్షాలకు
Congress 2nd List : న్యూఢిల్లీ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండో విడత జాబితా ఎంపిక చేసేందుకు భేటీ కానుంది ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ. ఇందుకు బుధవారం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రంలో 119 సీట్లకు గాను తొలి విడతగా పార్టీ 55 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది. పలు చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పుపై సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Congress 2nd List to be Released
సీట్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొల్లాపూర్ , నాగర్ కర్నూల్ లో ఎలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో చూస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
తాజాగా రేపే 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. చెన్నూరు, కొత్తగూడెం సీట్లను సీపీఐ పార్టీకి, వైరా, మిర్యాల గూడ స్థానాలను సీపీఎం పార్టీకి కేటాయించినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఉన్న పొత్తు దృష్ట్యా ఈసారి ఎన్నికల్లో వామపక్షాలకు నాలుగు సీట్లను ఇచ్చేందుకు ఒప్పుకుంది కాంగ్రెస్ పార్టీ(Congress).
మరో వైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు ఆ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్. సగానికి పైగా బి ఫారమ్ లు కూడా ఇచ్చారు. ఇక బీజేపీ 52 స్థానాలకు సంబంధించి తొలి విడతలో అభ్యర్థులను ఖరారు చేశారు.
Also Read : Eatala Rajender : ప్రాజెక్టుల నిర్మాణం అవినీతికి అందలం