Kailash Vijayvargiya : కైలాష్ కామెంట్స్ పై ప్రతిపక్షాలు కన్నెర్ర
కాంగ్రెస్ , ఆప్ , తదితర పార్టీలు ఫైర్
Kailash Vijayvargiya : అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండగా భారతీయ జనతా పార్టీకి చెందిన జాతయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ(Kailash Vijayvargiya) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఇప్పటికే ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేసిన ఢిల్లీ మీడియా ఇన్ చార్జ్ నవీన్ కుమార్ జిందాల్ పై వేటు పడింది.
అయినా బీజేపీ నేతల్లో మార్పులు రాలేదు. వారు మారడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గీత దాటితే వేటు ఉంటుందని బీజేపీ చీఫ్ హెచ్చరించినా పట్టించు కోవడం లేదు.
ఇదే సమయంలో కైలాష్ అగ్నివీర్ లపై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి దేశ వ్యాప్తంగా.
అగ్నిపథ్ స్కీంలో ఎంపికైన వారు నాలుగు సంవత్సరాల తర్వాత సర్వీసు నుంచి దిగి పోతే వారందరికీ తమ పార్టీ ఆఫీసులలో సెక్యూరిటీ గార్డులుగా అవకాశం ఇస్తామని చెప్పారు.
కైలాష్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ , ఆప్ , తదితర పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పటికే నూపుర్ శర్మతో తీవ్ర డ్యామేజ్ ను కవరేజ్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది పార్టీ.
దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో కైలాష్ విజయ వర్గీయ స్పందించారు. తాను అన్న వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు తప్పుగా వక్రీకరించాయని ఆరోపించారు.
తాను అలా అనలేదని పేర్కొన్నారు. మరో వైపు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
Also Read : మరాఠాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు