Congress Rally : 28న ఢిల్లీలో కాంగ్రెస్ ‘బోలో చలో ఢిల్లీ’
మోదీ కేంద్ర సర్కార్ పై పార్టీ ఆగ్రహం
Congress Rally : ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ(Congress Rally) నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టు 28న దేశ రాజధాని ఢిల్లీలో మెగా ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఆగస్టు 17 నుండి వ్యవసాయ మండీలు, రిటైల్ మార్కెట్ లతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు, ఆందోళనలు చేపట్టనుంది.
ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. పంథా మార్చు కోవాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా ఈనెల 17 నుండి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొంది.
రాజధానిలో 28న ఢిల్లీ లోని రాం లీలా మైదానంలో మెగా ర్యాలీతో ముగుస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రసంగిస్తారని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీలు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో బోలో చలో ఢిల్లీ పేరుతో ర్యాలీని నిర్వహిస్తామని తెలిపింది.
ఆగస్టు 5న నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై(Congress Rally) మోదీ కామెంట్ చేయడాన్ని తప్పు పట్టారు జైరాం రమేష్. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నియంత్రించడంలో విఫలమైందని పేర్కొన్నారు.
బీజేపీ సర్కార్ నిర్వాకం వల్ల ప్రజలపై పెను భారం పడిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు తమ గొంతు వినిపించకుండా పార్లమెంట్ లో ప్రశ్నించకుండా నిలిపి వేశారంటూ మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
Also Read : బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈడీ సమన్లు