Congress Chintan Shivir : ‘పార్లమెంటరీ బోర్డు’ తిరస్కరణ
జీ23 అసమ్మతి నేతలకు కోలుకోలేని షాక్
Congress Chintan Shivir : రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ చింతన్ శివిర్(Congress Chintan Shivir) ఆదివారంతో ముగిసింది. ఈనెల 13న ప్రారంభమై 15న పూర్తయింది. పలు అంశాలపై పార్టీ చర్చించింది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. 400 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దేశానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి.
పార్టీకి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే ఫ్యామిలీ ఒకే పోస్ట్ అన్న దానికి ఓకే చెప్పింది ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన కూడా చేశారు.
గాంధీ జయంతి రోజున రాహుల్ గాంధీ నేతృత్వంలో పాద యాత్ర ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఈ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా జీ23 అసమ్మతి నేతలు అంతా హాజరయ్యారు.
ఒక్క కపిల్ సిబల్ తప్ప. ఈ సందర్భంగా గాంధీ వ్యతిరేక ఫ్యామిలీ గ్రూప్ ప్రధానంగా పార్టీ పరంగా రద్దు చేసిన పార్లమెంటరీ బోర్డును పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధికారాలకు కత్తెర పడుతుందని గ్రహించిన సోనియా అందుకు ఒప్పుకోలేదు.
మిగతా వాటికి ఓకే చెప్పింది. కానీ దాని దగ్గరే ఆగి పోయింది. ఒక రకంగా జీ23 నేతలతో సంప్రదింపులు జరిపినా కీలక సమయంలో వారికి చెక్ పెట్టింది.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నవ సంకల్ప్ చింతన్ శివిర్(Congress Chintan Shivir) ఆసక్తికరంగా, మరింత ఉత్సాహాన్ని నింపేలా చేసిందినడంలో సందేహం లేదు.
Also Read : అక్టోబర్ 2 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర