Shivraj Singh Chouhan : కాంగ్రెస్ డీఎన్ఏ పాక్ కు అనుకూలం

సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కామెంట్స్

Shivraj Singh Chouhan : పుల్వామా, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో నివేదిక స‌మ‌ర్పించ లేద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌ధ్య ప్ర‌దేశ్ మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్(Shivraj Singh Chouhan). ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు ప్ర‌స్తుత రాష్ట్ర సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్.

కాంగ్రెస్ డీఎన్ఏ పాకిస్తాన్ కు అనుకూలంగా ఉందంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఒక బాధ్య‌త క‌లిగిన సీనియ‌ర్ నాయ‌కుడు భార‌త సైన్యాన్ని కించ ప‌రిచేలా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు చౌహాన్. దేశంలో అంద‌రి కోసం పాద‌యాత్ర చేప‌డుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన రాహుల్ గాంధీ దీనిని ఎలా స్వాగ‌తిస్తారంటూ నిల‌దీశారు శివ‌రాజ్ సింగ్ చౌహాన్.

ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. భార‌త సైన్యాన్ని నిరుత్సాహ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆ పార్టీ డీఎన్ఏ ప్ర‌తిసారి పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. ఏనాడైనా భార‌త్ పాక్ తో యుద్దం చేసిందా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శివ‌రాజ్ సింగ్ చౌహాన్.

మంగ‌ళ‌వారం మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం మీడియాతో మాట్లాడారు. తుక్డే తుక్డే గ్యాంగ్ త‌న‌తో ఎక్క‌డ న‌డుస్తోందంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి సెటైర్ వేశారు శివ‌రాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan).

ఇవాళ మిమ్మ‌ల్ని, భార‌త దేశం మొత్తాన్ని కంటికి కాపాడుకుంటూ వ‌స్తున్న భార‌త బ‌ల‌గాల‌ను గాయ‌ప‌రిచారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీ యాత్ర‌కు ఎవ‌రు సెక్యూరిటీ క‌ల్పిస్తున్నారో మ‌రిచి పోతే ఎలా అని మండిప‌డ్డారు.

Also Read : రాహుల్ రాజీనామా ఆద‌ర్శ‌నీయం – పైల‌ట్

Leave A Reply

Your Email Id will not be published!