Amit Shah : ప‌టేల్ ను ప‌ట్టించుకోని కాంగ్రెస్ – అమిత్ షా

గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కామెంట్స్

Amit Shah : గుజ‌రాత్ లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా(Amit Shah)కు ఈసారి రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు టార్గెట్ గా మారాయి. ఇప్ప‌టికే 27 ఏళ్ల పాటు వ‌రుస‌గా బీజేపీ ప‌వ‌ర్ లో కొన‌సాగుతూ వ‌స్తోంది.

ఈ త‌రుణంలో మ‌రోసారి గుజ‌రాత్ గ‌డ్డ‌పై కాషాయ జెండా ఎగుర వేయాల‌ని కంకణం క‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. డిసెంబ‌ర్ 1, 5న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మ‌రో వైపు భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీ సైతం నిప్పులు చెరిగారు.

మంగ‌ళ‌వారం జ‌రిగిన బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమిత్ చంద్ర షా(Amit Shah) పాల్గొన్నారు. గుజ‌రాత్ లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవ‌మానించింద‌ని ఆరోపించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచ‌డంలో ప‌టేల్ చేసిన కృషి విస్మ‌రించ లేమ‌న్నారు. కానీ ఆయ‌న‌కు ప్ర‌యారిటీ ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

ఆనంద్ జిల్లా ఖంభాట్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. హోం శాఖ మంత్రి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సంద‌ర్శించేందుకు కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ సాహ‌సించ లేర‌ని అన్నారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి కృషి చేశామ‌ని చెప్పారు.

రెండో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖంబాట్ తో పాటు 92 ఇత‌ర స్థానాల‌కు డిసెంబ‌ర్ 5న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.  కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోస‌మే అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణాన్ని, ట్రిపుల్ త‌లాక్ నిషేధ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తోంద‌ని ఆరోపించారు.

Also Read : ఆప్ దే ఢిల్లీ బ‌ల్దియా – గోపాల్ రాయ్

Leave A Reply

Your Email Id will not be published!