Congress Economic Reforms : ఆర్థిక సంస్క‌ర‌ణ‌లో మైలురాయి

ఆనాటి ప్ర‌ధానులు పీవీ, మ‌న్మోహ‌న్

Congress Economic Reforms : దేశంలో చోటు చేసుకున్న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యులు దివంగ‌త ప్ర‌ధాన మంత్రి పాముల‌ప‌ర్తి న‌ర‌సింహారావు, మాజీ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ . ఈ దేశం ఇవాళ పూర్తిగా స్వేచ్ఛా మార్కెట్ లోకి ప్ర‌వేశించేందుకు కార‌ణ‌మ‌య్యారు వీరు. ఇవాళ భార‌త దేశ చ‌రిత్ర‌లో అత్యంత ముఖ్య‌మైన రోజుగా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా గుర్తు చేసుకుంది.

Congress Economic Reforms India

1991వ సంవ‌త్స‌రం భార‌త దేశానికి , దేశ ప్ర‌జ‌ల‌కు ఒక ముఖ్య‌మైన సంద‌ర్భమ‌ని పేర్కొంది. ఆనాటి ప్ర‌ధాని పీవీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మ‌న్మోహ‌న్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భార‌త దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప‌రివ‌ర్త‌నాత్మ‌క ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. ఇది రాబోయే త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కత్వాన్ని చూపేలా చేసింద‌ని పేర్కింది కాంగ్రెస్(Congress) పార్టీ.

భార‌త దేశ అభివృద్దిని సుల‌భ‌త‌రం చేసి, కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను పేద‌రికం, అణ‌చివేత నుండి విముక్తి చేసిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌లో గ‌ణ‌నీయ‌మైన సాధ‌న లో కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన పాత్ర పోషించింద‌ని తెలిపింది.

ఆ ఇద్ద‌రు మ‌హా నాయ‌కులు తీసుకు వ‌చ్చిన ఈ ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ఇవాళ దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నించేలా చేశాయ‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Also Read : Heavy Rain : రాబోయే మూడు రోజులు వ‌ర్షాలు

 

Leave A Reply

Your Email Id will not be published!