Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ ఎన్నికలకు ముందు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో కలిసిన సిక్కు నాయకులతో మాట్లాడారు.
1947లో జరిగిన విభజన సమయంలో సిక్కుల పుణ్య క్షేత్రమైన కర్తార్ పూర్ సాహిబ్ దేశంలో ఉండేలా చూడడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ విషయాన్ని మరోసారి పునరావృతం చేశారు.
ఆప్గనిస్తాన్ నుంచి గురు గ్రంథ్ సాహిబ్ ను తిరిగి తీసుకు రావడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మా గురువులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో అణచివేతలకు గురయ్యాం.
ఆ సమయంలో నేను భూగర్భంలో ఉన్నాను. దాక్కోవడానికి నేను సిక్కు వేషం వేసుకునేందుకు పగ్డీ వేసుకునే వాడినని తెలిపారు. కర్తార్ పూరర్ సాహిబ్ పక్కనే ఉన్న పాకిస్తాన్ లో ఉంది.
కేవలం పంజాబ్ కు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందన్నారు మోదీ(Modi). కేవలం తక్కువ దూరంలో ఉన్న పంజాబీయుల ఆరాధ్య దైవంగా భావించే కర్తార్ పూర్ ను తీసుకు రావడంలో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చు కోలేక పోయారని మండిపడ్డారు.
తాను పంజాబ్ లో ఉన్నప్పుడు బైనాక్యూలర్ లో చూసే వాడిని. ఏదో ఒకటి చేయాలని ఉందన్నారు. ఇది చాలా పవిత్రమైన పని. గురువుల ఆశీర్వాదంతో తాము దీన్ని చేశామన్నారు. భక్తి లేకుండా ఇది సాధ్యం కాదన్నారు.
ప్రధాన మంత్రి ఇవాళ సిక్కు నాయకులకు ప్లేట్లను అందించారు. ఇవాళ మీకు సేవ చేయాలని అనుకుంటున్నానంటూ తెలిపారు.
Also Read : లాలూ ప్రసాద్ కు ప్రియాంక సపోర్ట్