Hegdewar Removed : హెడ్గేవార్ అధ్యాయం తొల‌గింపు

క‌ర్ణాటక కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం

Hegdewar Removed : క‌ర్ణాట‌క‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న హ‌యాంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షిస్తోంది కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్య‌వ‌స్థాప‌కుడు హేడ్గే వార్(Hegdewar) కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన అధ్యాయాన్ని పిల్ల‌లు చ‌దుకునే పాఠ్య పుస్త‌కాల్లో చేర్చింది. దీనిపై పాఠ‌శాల రివ్యూ క‌మిటీ తాజాగా స‌మీక్షించింది.

ఈ మేర‌కు హేడ్గే వార్ గురించి చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న దేశానికి సంబంధించి ఎలాంటి గొప్ప నాయ‌కుడు కాదంటూ అభిప్రాయ‌ప‌డింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు తాజాగా త‌మ స‌ర్కార్ పాఠ్య పుస్త‌కాల్లోంచి ఆర్ఎస్ఎస్ వ్య‌వ‌స్థాప‌కుడికి సంబంధించిన ఏ అంశం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని శుక్ర‌వారం వెల్ల‌డించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హ‌రి ప్ర‌సాద్. బ్రిటీష్ వారికి క్ష‌మాభిక్ష రాసిన‌ట్లు హేడ్గే వార్ స్వ‌యంగా అంగీక‌రించార‌ని , అందుకే పిరికి వాళ్ల గురించి త‌మ పిల్ల‌ల‌కు బోధించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.
రైట్ వింగ్ రైట‌ర్ రోహిత్ చ‌క్ర తీర్థ నేతృత్వంలోని క‌మిటీతో సంప్ర‌దింపులు ప్ర‌భుత్వం జ‌రిపింద‌న్నారు. దీంతో స‌ర్కార్ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు.

Also Read : Delhi Police WFI Chief : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఇంటికి రెజ్ల‌ర్

 

Leave A Reply

Your Email Id will not be published!