Shashi Tharoor : కాంగ్రెస్ భావ‌జాలం మారాలి – థ‌రూర్

85వ ప్లీన‌రీలో ఎంపీ షాకింగ్ కామెంట్స్

Shashi Tharoor Plenary Meet : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ లో 85వ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. రెండ‌వ రోజు శ‌నివారం శ‌శి థ‌రూర్ ప్ర‌సంగించారు. 15 వేల మంది ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించాలంటే మ‌న భావ‌జాలం మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఎందుకంటే దేశంలో ఆక్టోప‌స్ లా బీజేపీ కూరుకు పోయింద‌న్నారు. విద్వేషాల పునాదుల మీద బీజేపీ త‌న ప్ర‌య‌త్నాలు చేస్తోందన్నారు. ఇదే స‌మ‌యంలో 137 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దేశానికి తెలుసు. కానీ రాబోయే కాలంలో ఏం చేస్తామో కూడా మ‌నం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తాను పార్టీకి సంబంధించి భావ జాలాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం లేద‌న్నారు. కానీ అత్యాధునిక టెక్నాల‌జీని కూడా అంది పుచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor Plenary Meet). ప్ర‌బ‌లిన క్రోనీ క్యాపిట‌లిజం కొద్ది మంది చేతుల్లో సంప‌ద పోగు ప‌డుతోంద‌న్నారు. దీనిని గ‌ట్టిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్య‌త పార్టీ శ్రేణుల్లో ఉందన్నారు. అదానీతో మోదీ జ‌త‌క‌ట్టినా ప్ర‌శ్నించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ త‌న భావజాలం గురించి క‌చ్చిత‌మైన అభిప్రాయం క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. లేక పోతే మ‌ళ్లీ బోర్లా ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : పాశ్చాత్య మ‌న‌స్త‌త్వానికి చెక్ – ఠాగూర్

Leave A Reply

Your Email Id will not be published!