Ghulam Nabi Azad : నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకత్వం (Former Union minister) మారాలని హల్ చల్ చేసిన జీ23కి నాయకత్వం వహిస్తున్న గాంధీ ఫ్యామిలీ వ్యతిరికగా ముద్ర పడిన మాజీ కేంద్ర మంత్రి, (Former CM), కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ట్రబుల్ షూటర్ ఆజాద్ (Ghulam Nabi Azad) స్వరం మార్చారు (Congress Leader).
ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా మాట్లాడారు. తన నివాసంలో జరిగిన సమావేశంలో గాంధీ కుటుంబ వ్యతిరేక నాయకులంతా కొన్ని డిమాండ్లు పార్టీ ముందు ఉంచారని వాటిని సమ్మతిస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వస్తున్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. ఆజాద్ టీంలో కపిల్ సిబల్, శశి థరూర్, మనీశ్ తివారీ, భూపీందర్ సింగ్ హూడా, పృథ్విరాజ్ చౌహాన్, తదితరులు ఉన్నారు.
వీరితో పాటు మరికొందరు చేరారు. కపిల్ సిబల్ డైరెక్టుగా సోనియా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. వెంటనే వారంతా తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్త వారికి నాయకత్వాన్ని అప్పగించాలని కోరారు. ఈ తరుణంలో ఆజాద్(Ghulam Nabi Azad) కు ఫోన్ చేశారు సోనియా గాంధి. గత ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో సైతం సోనియా ఫ్యామిలీ మూకుమ్మడిగా తమ పదవుల నుంచి తప్పుకునేందుకు రెడీ అయ్యారు.
కానీ వారికి మద్దతుగా నిలిచిన వారంతా ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్ రెండుగా చీలి పోతోందన్న అనుమానం వ్యక్తమైంది. కాస్త మెత్తబడిన గులాం నబీ ఆజాద్ సోనియాతో భేటీ అయ్యాక మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని తేల్చి పారేశారు. సోనియా గాంధీ కొనసాగడం తమకు సమ్మతమేనని చెప్పారు. సమావేశంలో పలు సూచనలు చేశానని మేడం ఒప్పుకున్నారని తెలిపారు.
Also Read : ఇక కన్నడ నాట భగవద్గీత