Sidhu Dhillon : పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూకు ఊహించని షాక్ తగిలింది. ఆయన తాజాగా పంజాబ్ లోని చండీగఢ్ లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దూకు ఊహించని ఇబ్బంది ఏర్పడింది.
పార్టీలో ఎవరైనా తప్పు చేసినట్లు భావిస్తే వారి పేర్లు తనకు చెప్పాలని ప్రకటించాడు సిద్దూ(Sidhu Dhillon). దీంతో ఉన్నట్టుండి పంజాబ్ కాంగ్రెస్ యూత్ చీఫ్ బ్రిందర్ సింగ్ ధిల్లాన్ అడ్డుకున్నాడు.
పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సిద్దూను అడ్డు కోవడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ ఘటన చండీగఢ్ లోని పంజాబ్ కాంగ్రెస్ భవన్ వెలుపల పెట్రోల్ ,డీజిల్ , వంట గ్యాస్ ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భగా సిద్దూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది.
117 సీట్లలో కేవలం 18 సీట్లు మాత్రమే గెలుపొందింది. ఇందులో సిద్దూతో పాటు సీఎం చన్నీ కూడా ఓడి పోయాడు. దీంతో పార్టీ పునరుద్దరణ కోసం క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించడం గురించి సిద్దూ ప్రసంగించాడు.
నేను ఎవరి పేరునూ తీసుకోలేదు లేదా అలా చేయను అన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఆ విషయం తెలుసు అని చెప్పారు. సిద్దూ మీరు చేస్తున్నది పూర్తిగా తప్పు అంటూ ఎదురు దాడికి దిగాడు ధిల్లాన్.
ప్రస్తుతం ధిల్లాన్ , సిద్దూ వ్యవహారం చర్చకు దారితీసింది.
Also Read : గవర్నర్ ధన్ కర్ తో సీఎం దీదీ భేటీ