Jaggareddy : మీడియాపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
తనపై పలు టీవీలలో, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు...
Jaggareddy : మహిళా కలెక్టర్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే తాను ఒకటి చెబితే పలు టీవీ ఛానళ్లు మరోటి ప్రసారం చేస్తున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. పలు ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలపై విరుచుకుపడ్డారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. తనపై పలు టీవీలలో, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను అప్రతిష్ఠపాలు చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
Jaggareddy Slams..
‘‘నేను గతంలో రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మగ కలెక్టర్‌ను ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశానని నేనే బహిరంగ సభలో చెప్పాను. కానీ కొన్ని టీవీలలో నేను మహిళ కలెక్టర్‌ను తిట్టినట్టు… బూతులు మాట్లాడినట్టు టీవీలలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్‌ను నేను ఏమీ అనలేదు. గత కలెక్టర్‌ను నేను మాటలు అన్నానని నేను చెప్పిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు. వారికి అందరికీ లీగల్ నోటీసులు ఇస్తా’’ అని తెలిపారు. బీఆర్ఎస్ టీవీలతో పాటు ఇతర టీవీలలో తనపై చేసిన తప్పుడు ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదని.. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదిలేదని జగ్గారెడ్డి(Jaggareddy) స్పష్టం చేశారు.
‘‘నేను గతంలో రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మగ కలెక్టర్‌ను ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశానని నేనే బహిరంగ సభలో చెప్పాను. కానీ కొన్ని టీవీలలో నేను మహిళ కలెక్టర్‌ను తిట్టినట్టు… బూతులు మాట్లాడినట్టు టీవీలలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్‌ను నేను ఏమీ అనలేదు. గత కలెక్టర్‌ను నేను మాటలు అన్నానని నేను చెప్పిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు. వారికి అందరికీ లీగల్ నోటీసులు ఇస్తా’’ అని తెలిపారు. బీఆర్ఎస్ టీవీలతో పాటు ఇతర టీవీలలో తనపై చేసిన తప్పుడు ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదని.. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదిలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu : ఎక్కడ ఇసుక దందాలు జరిగినా తిరుగుబాటు చేయండి నేను అండగా ఉంటా..