Rahul Gandhi Leakes : మోదీ స‌ర్కార్ కు కాంగ్రెస్ లీగ‌ల్ నోటీస్

రాహుల్ గాంధీ విచార‌ణ‌కు సంబంధించి లీకులు

Rahul Gandhi Leakes : నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌కు సంబంధించిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ముందు హాజ‌ర‌య్యారు.

ఆయ‌న వ‌రుస‌గా మూడో రోజు కూడా హాజ‌రు కావ‌డం విశేషం. సోమ‌వారం 10 గంట‌ల‌కు పైగా రాహుల్ గాంధీని విచారించింది ఈడీ. మంగ‌ళ‌వారం రోజు 11 గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించింది.

బుధ‌వారం ఇంకా కాంగ్రెస్ నేత‌ను ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూనే ఉంది. అయితే ఎవ‌రైనా లేదా ఏ పార్టీకి చెందిన వారైన‌ప్ప‌టికీ విచార‌ణ ఎదుర్కొంటున్న వారి గురించి ఎలాంటి స‌మాచారాన్ని బ‌య‌ట‌కు లీక్ చేయ‌కూడ‌దు.

కాగా రాహుల్ గాంధీకి సంబంధించి ఈడీ విచార‌ణ గురించి మిన‌ట్ మిన‌ట్ మీడియాకు లీక్ అవుతుండ‌డంపై(Rahul Gandhi Leakes) కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది.

రాహుల్ గాంధీ మీడియా లీక్స్(Rahul Gandhi Leakes) పై బాధ్య‌త వ‌హించాల్సింది కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వ‌మేనంటూ ఆరోపించింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి పార్టీ త‌ర‌పున లీగ‌ల్ నోటీసు పంపిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది పార్టీ.

ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డింది.

ఇవాళ పంపిన లీగ‌ల్ నోటీసులో త‌న అభిప్రాయాన్ని తెలియ చేసేందుకు న్యూస్ ఛాన‌ల్స్ లో వ‌చ్చిన మూడు నివేదిక‌ల‌ను ఉద‌హ‌రించారు ప్ర‌త్యేకంగా. రాహుల్ గాంధీ మీడియా లీక్స్ వెనుక ప్ర‌భుత్వం ఉందంటూ ఆరోపించింది పార్టీ.

ఇదిలా ఉండ‌గా వార్తా ప‌త్రిక‌కు చెందిన 300 మిలియ‌న్ డాలర్ల విలువైన ఆస్తుల‌ను అక్ర‌మంగా నియంత్రించేందుకు ఓ షెల్ కంపెనీని ఏర్పాటు చేశార‌ని ఈడీ ఆరోపించింది. ఈ మేర‌కు 25 గంట‌ల పాటు రాహుల్ గాంధీని ప్ర‌శ్నించింది.

Also Read : అగ్నిపథ్ స్కీమ్‌పై రాహుల్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!