Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో
ప్రొఫెసర్ జానయ్య కామెంట్
Congress Manifesto : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేని ఫెస్టోపై బీఆర్ఎస్ మంత్రులు చులకనగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ప్రొఫెసర్ జానయ్య. తాము మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయడం జరిగిందన్నారు.
Congress Manifesto Viral
ప్రజా స్వామిక పరిపాలన పునరుద్దరణ కోసం ప్రజా దర్బార్ ను ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరేలా మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చినట్లు తెలిపారు. మానవ అభివృద్ది సూచిలో తెలంగాణ 10 వ ర్యాంకు నుండి 20వ ర్యాంక్ కు పడి పోయిందని పేర్కొన్నారు జానయ్య.
ఈ మేనిఫెస్టలో రాష్ట్రంలోని రైతులకు అదనంగా రూ. 1 లక్ష లాభం చేకూరనుందని తెలిపారు. కాంగ్రెస్(Congress) మేనిఫెస్టోపై అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు . తమ మేని ఫెస్టోను 420 అని పేర్కొనడం దారుణమన్నారు. మొత్తంగా ఈ మేనిఫెస్టో ప్రజలకు చెందినదని స్పష్టం చేశారు జానయ్య.
Also Read : Amit Shah : వెళ్లి పోయే వాళ్లను పట్టించుకోం