Congress Focus : కీలక పదవుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్
చింతన్ శివిర్ బైటక్ తర్వాత మార్పులు
Congress Focus : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ(Congress Focus) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శివర్ లో కీలక అంశాలకు సంబంధించి తీర్మానాలు చేశారు.
ఈ మేరకు కాంగ్రెస్ పునరుద్దరణ ప్రణాళికను రూపొందించిన ఒక నెల తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ జైరాం రమేష్ ను పబ్లిసిటీ, సోషల్ , డిజిటల్ మీడియాతో కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీగా నియమించింది పార్టీ.
మీడియా చీఫ్ గా ఫైర్ బ్రాండ్ పవన్ ఖేరాకు బాధ్యతలు అప్పగించింది. ఉదయ్ పూర్ సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. నాయకులు నగరాల్లో కాదు ఉండాల్సింది ప్రజల వద్దకు వెళ్లాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశ రాజకీయాలలో సోషల్ మీడియా , మీడియా , ప్రింట్ రంగాలలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టాప్ లో ఉంది.
ఆ పార్టీ 100 మార్కులకు 95 శాతంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ(Congress Focus) 100కు 25 శాతంగా ఉందని ఓ సీనియర్ నేత కామెంట్ చేయడం కలకలం రేపింది.
ఏది ఏమైనా కమ్యూనికేషన్స ను , లేటెస్ట్ టెక్నాలజీని ఆ పార్టీ వాడుకున్నంత కాంగ్రెస్ వాడుకోక పోవడం పెద్ద మైనస్ పాయింట్. ఇక మూడు రోజుల మేధోమథనం సందేశం ,
అక్కడ తీసుకున్న నిర్ణయాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయని తెలిపారు పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కీలక పదవులలో మార్పులు చేయనుంది పార్టీ.
Also Read : జాబ్స్ ఇస్తామన్నారు అగ్గి రాజేశారు – రాహుల్