Congress Party Slams : కమలం..కారు ఒక్కటే – కాంగ్రెస్
మూడు పార్టీలు లోపాయికారి ఒప్పందం
Congress Party : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన కామెంట్స్ చేసింది. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. పైకి తిట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయంటూ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, ఎంఐఎంలపై మండిపడింది. ఎంఐఎం చీఫ్ ఓవైసీ బహిరంగంగా మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపించింది. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో కావాలని కాంగ్రెస్ పార్టీని(Congress Party) బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎం పార్టీలు టార్గెట్ చేశాయని ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది.
Congress Party Slams BJP and BRS
ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోందని వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నారంటూ ఆరోపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్నటి దాకా తిట్టిన ఎంపీ ధర్వపురి అర్వింద్ కేసీఆర్ , కల్వకుంట్ల కవితను పొగడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.
ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో దింపుడు కళ్లెం ఆశలతో కేసీఆర్ అడ్డదారులు తొక్కుతున్నాడని , ఈ సీ నోటిని అదుపులో పెట్టుకోమని హెచ్చరించినా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. జనం కూడా ఆ మూడు పార్టీలు లోపాయికారి ఒప్పందానికి వచ్చినట్లు అంచనాకు వచ్చినట్లు తెలిపింది.
Also Read : Minister KTR : రాబందులను తరిమి కొట్టండి
