Digvijay Singh : అశోక్ గెహ్లాట్ అవుట్ దిగ్విజ‌య్ సింగ్ ఇన్

ఏఐసీసీ చీఫ్ ప‌ద‌వి ఎన్నిక‌కు నామినేష‌న్

Digvijay Singh : కాంగ్రెస్ పార్టీలో ఆస‌క్తిక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌టి దాకా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అన్న నినాదం ఊపందు కోవ‌డం, రాహుల్ గాంధీ ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంతో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ లో రాజ‌కీయ సంక్షోభం చోటు చేసుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా గెహ్లాట్ అని భావించింది హైకమాండ్ . ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ గెహ్లాట్ ను ప‌క్క‌న పెట్టేసింది. చివ‌ర‌కు మ‌ధ్య ప్ర‌దేశ్ కు చెందిన మాజీ సీఎంలు క‌మ‌ల్ నాథ్, దిగ్విజ‌య్ సింగ్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి.

దీనిపై మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ ఖండించారు. ఆయ‌న మేడంతో క‌లిశాక మీడియాతో మాట్లాడారు. స‌చిన్ పైల‌ట్, అశోక్ గెహ్లాట్ ఇద్ద‌రూ త‌న‌కు మంచి మిత్రులంటూ స్ప‌ష్టం చేశారు. తాను అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో లేన‌ని పేర్కొన్నారు. చివ‌ర‌కు ఎవ‌రు బ‌రిలో ఉంటార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించింది హైక‌మాండ్.

చివ‌ర‌కు సోనియా గాంధీ మాజీ సీఎం, సీనియ‌ర్ నాయ‌కుడు దిగ్విజ‌య్ సింగ్(Digvijay Singh)  పేరు ఖ‌రారు చేసింది. ఇదే విష‌యాన్ని ధ్రువీక‌రించారు డిగ్గీ రాజా. అశోక్ గెహ్లాట్ కు బ‌దులు గాంధీ ఫ్యామిలీకి న‌మ్మిన బంటుగా ఉన్నారు.

మేడం చెప్పిన మాట‌ల‌ను జ‌వ‌దాట‌ని నాయ‌కులుగా పేరొందారు గెహ్లాట్, డిగ్గీ రాజా, క‌మ‌ల్ నాథ్, ముఖుల్ వాస్నిక్, దీపింద‌ర్ హూడా. ఇక పార్టీ చీఫ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 30. శుక్ర‌వారం తాను నామినేషన్ వేస్తాన‌ని ప్ర‌క‌టించారు దిగ్విజ‌య్ సింగ్.

Also Read : ఎవ‌రైనా పార్టీకి క‌ట్టుబడి ఉండాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!