Reliance Retail : బెంగ‌ళూరులో రిల‌య‌న్స్ లైఫ్ స్టైల్ స్టోర్

రిల‌య‌న్స్ జారా కు ఇషా అంబానీ చీఫ్

Reliance Retail : రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి ఫ్యాష‌న్స్, లైఫ్ స్టైల్ కంపెనీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టింది ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ. రిటైల్ ప‌రిశ్ర‌మ‌లో ముకేష్ కంపెనీ దూకుడుగా ముందుకు సాగ‌డంలో భాగంగా ఈ ప్ర‌యోగం జ‌రిగింది.

ల‌గ్జ‌రీ మార్కెట్ లో ఉన్న స్పేస్ ను ఆక్ర‌మించే దిశ‌గా కంపెనీ పావులు క‌దుపుతోంది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన రిటైల్(Reliance Retail) యూనిట్ త‌న మొద‌టి ఇన్ హౌస్ ప్రీమియం ఫ్యాష‌న్ , లైఫ్ స్టైల్ స్టోర్ ను గురువారం ప్రారంభించింది.

బెంగ‌ళూరులో అజోర్డే అనే కొత్త స్టోర్ చెయిన్ , మ్యాంగో , ఇండ‌స్ట్రియా డిసెనో టెక్స్ టిల్ ఎస్ఏ యాజ‌మాన్య‌మైన జ‌రా వంటి వాటితో పోటీ ప‌డుతుంది. మిలీనియ‌ల్స్ గా మిడ్ ప్రీమియం ఫ్యాష‌న్ సెగ్మెంట్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న వినియోగ‌దారుల విభాగాల‌లో ఒక‌టి.

జెన్ జెడ్ అంత‌ర్జాతీయ , స‌మ‌కాలీన భార‌తీయ ఫ్యాష‌న్ ల కోసం ఎక్కువ‌గా డిమాండ్ ఉంటోందని రిల‌య‌న్స్ రిటైల్ ఫ్యాష‌న్ , జీవ‌న శైలి విభాగానికి చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ అఖిలేష్ ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

దేశీయ‌, గ్లోబ‌ల్ బ్రాండ్ ల‌తో భాగ‌స్వామ్యాల‌ను ఏర్ప‌ర్చుకుంటూ రిటైల్ పరిశ్ర‌మ‌లో అంబానీ కంపెనీ మ‌రింత దూకుడు పెంచింది. కంపెనీ ఏడాది లోపు 50 నుండి 60 కిరాణా, గృహ , వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌ణ బ్రాండ్ ల పోర్ట్ ఫోలియోను నిర్మించాల‌ని యోచిస్తోంది.

ఎల్వీఎంహెచ్ యాజ‌మాన్యంలోని ఫ్రెంచ్ బ్యూటీ బ్రాండ్ సెఫోరా హ‌క్కుల‌ను పొందేందుకు అధునాత‌న చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

Also Read : అక్టోబ‌ర్ నుంచి 5జీ సేవ‌లు షురూ

Leave A Reply

Your Email Id will not be published!