APPSC Jobs : 269 జాబ్స్ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్

తీపి క‌బురు చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం

APPSC Jobs : తెలంగాణ‌లో అదిగో ఇదిగో జాబ్స్ అంటూ ఊరిస్తూ వ‌స్తున్నా ఏపీలో మాత్రం అలాంటిది ఏమీ క‌నిపించడం లేదు. ఎప్ప‌టి లాగానే ఉద్యోగాల భ‌ర్తీ కంటిన్యూగా కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే జాబ్స్ రిక్రూట్ మెంట్స్ కు సంబంధించి ముందస్తుగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) జాబ్ క్యాలండ‌ర్ డిక్లేర్ చేసింది.

ఇందుకు ప్ర‌త్యేకంగా ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అభినందించాల్సిందే. తాజాగా నిరుద్యోగుల‌కు , ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా మొత్తం 269 పోస్టుల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ల‌ను డిక్లేర్ చేసింది ఏపీపీఎస్సీ(APPSC Jobs). ఆయా పోస్టుల‌లో గ్రూప్ -4 స‌ర్వీసెస్ , మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, లెక్చ‌ర‌ర్ త‌దిత‌ర పోస్టుల‌ను ప్ర‌క‌టించింది.

పోస్టుల భ‌ర్తీకి గాను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో నోటిఫికేష‌న్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్ లైన్ లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 29 నుండి అక్టోబ‌ర్ 19 వ‌ర‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక 45 నాన్ గెజిటెడ్ పోస్టుల‌కు (జ‌న‌ర‌ల్ ప‌రిమిత భ‌ర్తీ ) అక్టోబ‌ర్ 11 నుండి న‌వంబ‌ర్ 2 దాకా స‌మ‌ర్పించేందుకు వీలు క‌లుగుతుంది.

ఆయుష్ విభాగంలో 3 ఆయుర్వేదిక్ లెక్చ‌ర‌ర్ పోస్టులు ఉన్నాయి. అక్టోబ‌ర్ 7 నుండి 22 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఆయుష్ విభాగంలో 34 లెక్చ‌ర‌ర్స్ , అసిస్టింట్ ప్రొఫెస‌ర్ల పోస్టులు ఉన్నాయి. వివిధ ఇంజ‌నీరింగ్ స‌ర్వీసుల్లో 23 ఏఈఇ పోస్టులు ఉన్నాయి.

వీటి కోసం అక్టోబ‌ర్ 26 నుండి న‌వంబ‌ర్ 15 దాకా ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించేందుకు వీలు క‌లుగుతుంది. ఏపీ ఇన్సూరెన్స్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ లో 7 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు ఉన్నాయి. వీటిని అక్టోబ‌ర్ 27 నుండి నవంబ‌ర్ 16 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

Also Read : దేశంలో ఊపందుకున్న క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!