SRH vs MI : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

కాగా.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది....

SRH vs MI : ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు సన్‌రైజర్స్(SRH) రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ ఇరుజట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా.. అందులో సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్‌లోనే ఎస్ఆర్‌హెచ్ 287 పరుగులతో విధ్వంసం సృష్టించి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ముంబై (262) కూడా లక్ష్యానికి దరిదాపుల్లోకి వచ్చింది కానీ ఛేధించలేకపోయింది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది.

SRH vs MI Today Match

కాగా.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కానీ.. ముంబై మాత్రం ఈ సీజన్‌లో అత్యంత పేలవంగా రాణిస్తోంది. పదకుండు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. కేవలం మూడు విజయాలే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ నుంచి అది నిష్క్రమించింది. ఇక ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిల్లో హైదరాబాద్ 10 గెలవగా, ముంబై 12 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉంది. వాంఖడే స్టేడియంలోనూ ముంబైదే ఆధిపత్యం. ఈ గ్రౌండ్‌లో ముంబై ఐదు సార్లు విజయం సాధిస్తే.. సన్‌రైజర్స్ రెండుసార్లు మాత్రమే గెలుపొందింది.

Also Read : Telangana Govt : రైతన్నలకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!