Congress Sanjay Raut : సంజయ్ రౌత్ అరెస్ట్ పై కాంగ్రెస్ కన్నెర్ర
ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారని ఆరోపణ
Congress Sanjay Raut : కేంద్రాన్ని పదే పదే ప్రశ్నించడాన్ని తట్టుకోలేకే శివసేన అగ్ర నాయకుడు సంజయ్ రౌత్ ను టార్గెట్ చేసిందని, చివరకు అరెస్ట్ చేసేంత దాకా వదలలేదని మండిపడింది కాంగ్రెస్ పార్టీ(Congress Sanjay Raut).
ఈ దేశంలో విపక్షాలు లేకుండా చేయాలనే టార్గెట్ తో మోదీ త్రయం ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. సంజయ్ రౌత్ మామూలోడు కాదు దమ్మున్నోడు.
అంతే కాదు తనపై కేసులు బనాయించినా, అరెస్ట్ చేసినా చివరకు చంపినా తన గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుందని ప్రకటించాడు. అంతే కాదు తాను శివసేన పార్టీని వీడనని పోరాటం నుంచి వైదొలగనని స్పష్టం చేశాడు సంజయ్ రౌత్.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రజాస్వామికంగా ఎన్నికైన 9 రాష్ట్రాలను కూల దోసిన చరిత్ర వారికి ఉందంటూ ఆరోపించింది కాంగ్రెస్.
పార్లమెంట్ లో ఒక్క బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందంటూ సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
ఈడీ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. తన సంపూర్ణ మద్దతు సంజయ్ రౌత్ కు ఇస్తున్నట్లు తెలిపారు.
అతను కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు. అద్భుతమైన పట్టుంది. అంతే కాదు దమ్మున్న లీడర్ అని ప్రశంసించాడు. ఏదో ఒక రోజు కేంద్రానికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాక తప్పదని హెచ్చరించారు చౌదరి.
సంజయ్ రౌత్ చేసిన నేరం ఒక్కటే. బీజేపీ పార్టీ బెదిరింపు రాజకీయాలకు భయపడలేదు. మేమంతా అతడి వైపు ఉన్నామని స్పష్టం చేశారు ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు.
Also Read : తుపాకికి తుపాకీతోనే సమాధానం చెప్పాలి