Congress Protests : ఈడీ సోదాలపై కాంగ్రెస్ నిరసన
నేషనల్ హెరాల్డ్, ఏజీఎల్ పై దాడులు
Congress Protests : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మంగళవారం ఆకస్మికంగా నేషనల్ హెరాల్డ్ తో పాటు ఏజీఎల్ ఆఫీసులపై మూకుమ్మడి దాడులు చేపట్టింది. 12 చోట్ల సోదాలు జరిపినట్లు సమాచారం.
ఈడీ దాడులు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ(Congress Protests) ఆధ్వర్యంలో ఢిల్లీ లోని నేషనల్ హెరాల్డ్ హౌస్ లో ఆ పత్రిక కార్యాలయం వద్ద ప్ల కార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని, మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని ప్రశ్నించింది.
రాహుల్ ను 5 రోజుల పాటు రోజుకు12 గంటల చొప్పున ప్రశ్నించింది ఈడీ. సోనియాను మూడు రోజుల పాటు 6 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, మనీ లాండరింగ్ చోటు చేసుకుందని గతంలో కేసు నమోదైంది. ఇందులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసు కొట్టి వేశారు.
కానీ మోదీ ప్రభుత్వం కొలువు తీరాక ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి ఇందులో మనీ చోటు చేసుకుందంటూ ఆరోపణలు చేశారు. దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఇవాళ సోనియా, రాహుల్ విచారణలో చోటు చేసుకున్న ప్రశ్నలకు సంబంధించి వారిచ్చిన జవాబుల మేరకు ఈ రెండు సంస్థల ఆస్తులను అటాచ్ చసే అవకాశం ఉందని సమాచారం.
కానీ కాంగ్రెస్ మాత్రం కావాలని కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపించింది.
Also Read : మంకీ పాక్స్ కొత్త వ్యాధి కాదు – మన్సుఖ్