Youth Congress Protest : ఢిల్లీలో కాంగ్రెస్ నిర‌స‌న రైళ్ల నిలిపివేత‌

అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌

Youth Congress Protest : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీం కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న చేప‌ట్టింది. ఇందులో భాగంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో రైళ్ల‌ను వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకున్నారు.

కార్య‌క‌ర్త‌లు రైలు పైకి ఎక్కారు. మ‌రికొంద‌రు కేంద్ర స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ లోని శివాజీ బ్రిడ్జి రైల్వే స్టేష‌న్ లో రైళ్ల‌ను అడ్డుకున్నారు. దాని ముందు బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

అగ్నిప‌థ్ స్కీం వ‌ల్ల దేశానికి ఎలాంటి లాభం లేద‌ని ఆరోపించారు. వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. శివాజీ వంతెన వ‌ద్ద రైలును నిలిపి వేశారు. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మ‌రికొంద‌రు రైల్వే ట్రాక్ పై బైఠాయించారు. దేశానికి సేవ చేయాల‌ని, దాని బ‌ల‌గాల‌ను మ‌రింత బలోపేతం చేయాల‌ని అనుకునే నిరుద్యోగుల‌కు, యువ‌కుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు.

ఇప్ప‌టికే వ్యాపార‌స్తుల‌కు సంస్థ‌ల‌ను క‌ట్ట‌బెడుతూ వ‌స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర‌క్ష‌ణ రంగంలో సైతం కాంట్రాక్టు వ్య‌వ‌స్థ‌కు శ్రీ‌కారం చుట్టారంటూ ఆరోపించారు.

అందులో భాగంగానే అగ్నిప‌థ్ స్కీంను తీసుకు వ‌చ్చారంటూ మండిప‌డ్డారు. పోలీసులు రంగంలోకి దిగినా ఫ‌లితం లేక పోయింది. ప‌లు చోట్ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

యువ‌తీ యువ‌కుల‌కు అండ‌గా కాంగ్రెస్(Youth Congress Protest) ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రైల్వే స్టేష‌న్ల‌లో భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు.

ఇప్ప‌టికే సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో రూ. 30 కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం సంభవించింది.

Also Read : మోదీ మీ ఫ్రెండ్ అబ్బాస్ ను అడగండి

Leave A Reply

Your Email Id will not be published!