Rajani Ashokrao Patil Suspend : వీడియో రికార్డు ఎంపీ సస్పెండ్
కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్
Rajani Ashokrao Patil Suspend : కాంగ్రెస్ పార్టీకి చెందిన కోలుకోలేని షాక్ ఇచ్చింది. రాజ్యసభలో సభా నియమాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలను రికార్డు చేసినందుకు గాను ఆ పార్టీకి చెందిన ఎంపీ రజనీ పాటిల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. జగదీప్ ధన్ ఖర్ ఈ విషయంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా అనాగరికమైన చర్యగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని ఎంపీ రజనీ పాటిల్ తన మొబైల్ లో వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రజనీ పాటిల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
ఇది పూర్తిగా దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేశారు చైర్మన్ జగదీప్ ధన్ ఖర్. ఎంపీ రజనీ అశోక్ రావు పాటిల్ ను బడ్జెట్ సమావేశాల మిగిలిన భాగం రాజ్యసభ నుంచి శుక్రవారం సస్పెండ్(Rajani Ashokrao Patil Suspend) చేసినట్లు ప్రకటించారు. గురువారం ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రతిస్పందనకు ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నిరసన తెలపడం, ఆందోళన చేపట్టడాన్ని , చైర్మన్ పై దూసుకు రావడాన్ని ఎంపీ ప్రత్యేకంగా వీడియో తీశారని ఆరోపించారు. దీనిపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజ్యసభ చైర్మన్ , ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖర్ ఈ విషయంపై తీవ్రమైన అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇది పూర్తిగా సభా నియమాలకు విరుద్దమని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కక్ష సాధింపు చర్యగా ఆరోపించింది.
Also Read : సైఫుద్దీన్ జీ నేను మీ వాడినే – మోదీ