Congress Slams : కేఎస్ ఈశ్వరప్పపై కాంగ్రెస్ సెటైర్
అవినీతిలో భేష్ అని ప్రశంసించారా
Congress Slams : కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య ఈసారి నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా పలువురు సీనియర్లకు ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. మరికొందరు బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. వారిలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది ఉన్నారు. ఆ ఇద్దరూ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.
టికెట్ ఇవ్వనప్పటికీ తిరుగుబాటు చేయనందుకు కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించడం ఆమోద యోగ్యం కాదని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ(Congress Slams). అవినీతి పరులను ప్రశంచినట్లు అయ్యిందని మండిపడింది. ఇదిలా ఉండగా కేఎస్ ఈశ్వరప్ప 2022 ఏప్రిల్ లో కర్ణాటక గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.
కాంట్రాక్టర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఇక ఎన్నికల సమయంలో ఉన్నట్టుండి కేఎస్ ఈశ్వరప్ప సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు అన్నీ ఇచ్చిందని ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. శుక్రవారం స్వయంగా ప్రధాన మంత్రి మోదీ కేఎస్ ఈశ్వరప్పకు ఫోన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : డీకే నామినేషన్ కు ఈసీ ఓకే