Congress Slams : మోదీ అదానీ బంధం నిజం

కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌

Congress Slams : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌ముఖ వ్యాపార వేత్త గౌత‌మ్ అదానీకి మ‌ధ్య ఉన్న బంధం మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ స్పందించింది. ఈ మేర‌కు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Congress Slams PM Modi

ప్ర‌ధానికి గౌతమ్ అదానీ న‌మ్మ‌ద‌గిన మిత్రుడ‌ని తేలి పోయింద‌ని పేర్కొంది. ఓసీసీఆర్పీ నివేదిక 2013 – 2018 ప్ర‌కారం అదానీ గ్రూప్ ర‌హ‌స్యంగా త‌న స్వంతషేర్ల‌లో మిలియ‌న్ల పెట్టుబ‌డి పెట్టింద‌ని పేర్కొంది కాంగ్రెస్ పేర్కొంది.

లావాదేవీలు మారిష‌స్ ద్వారా జ‌రిగాయ‌ని ఈ విష‌యం అదానీ గ్రూప్ కు చెందిన ఇమెయిల్ ల ద్వారా బ‌ట్ట‌బ‌య‌లు అయ్యాయ‌ని ఆరోపించింది . పెట్టుబ‌డిదారులు న‌సీర్ అలీ షాబాన్ అహ్లీ, చాంగ్ చుంగ్ -లింగ్ విదేశీ కంపెనీల ద్వారా వాటా లావాదేవీల‌లో నిమ‌గ్న‌మై ఉన్నార‌ని పేర్కొంది కాంగ్రెస్(Congress) పార్టీ. ఈ ఇద్ద‌రి బ‌డా వ్యాపారుల‌తో గౌత‌మ్ అదానీతో ద‌గ్గ‌రి సంబంధాలు క‌లిగి ఉన్నాయ‌ని ఆరోపించింది.

లోపాయికారి ఒప్పందాల‌పై, మోదీ గౌత‌మ్ అదానీతో ఉన్న అనుబంధంపై హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ గ్రూప్ షేర్ల ధ‌ర‌ల‌ను తారు మారు చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది.

Also Read : Simhadri Appanna : సింహాద్రి అప్ప‌న్న‌కు పుష్పార్చ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!