Congress Tickets Row : కాంగ్రెస్ లో వారసుల గొడవ
మైనంపల్లి చేరికతో పార్టీకి తలనొప్పి
Congress Tickets Row : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల ఎంపిక ప్రహసనంగా మారింది. ఇప్పటి దాకా సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ వస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేయడం వెనుక వ్యూహంలో ఒక భాగమేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు. ఆయన చేరికతో ఇద్దరు డీసీసీ ప్రెసిడెంట్స్ గుడ్ బై చెప్పారు.
Congress Tickets Row Viral
పార్టీ పరంగా ఒక్కరికి ఒక్క టికెట్ మాత్రమే ఉంటుందని ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. ఉదయ్ పూర్ లో జరిగిన సీడబ్ల్యూసీ కీలక భేటీలో తీర్మానం చేశారు. కానీ హనుమంతరావు తన కొడుక్కి టికెట్ ఇస్తేనే తాను కండువా కప్పుకుంటానని కండీషన్ పెట్టారు. దీనికి పార్టీ ఒప్పుకుంది.
కాంగ్రస్(Congress) పార్టీలో ఇప్పుడు వారసుల గొడవ మొదలైంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం తమ పుత్ర రత్నాలకు టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా దీనిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో పాటు భార్య పద్మావతి రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. జానా రెడ్డి తనకు ఎంపీ, ఇద్దరు కొడుకులకు రెండు సీట్లు కోరుతున్నారు. మల్లు రవి తనకు ఎంపీ తో పాటు కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.
కొండా మురళి తనకు, భార్య సురేఖ, కూతురు కొండా సుష్మితకు టికెట్లు కోరుతున్నారు. పీజేఆర్ ఫ్యామిలీ నుండి విష్ణు వర్దన్ రెడ్డి, విజయ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తన కొడుకు సూర్యకు టికెట్ ఇవ్వాలని కోరుతోంది. ఇక బల రాం నాయక్ తనతో పాటు కొడుకు సాయి శంకర్ నాయక్ కు టికెట్ ఆశిస్తున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి తనకు తనయుడు అభిషేక్ రెడ్డికి టికెట్లు కోరుతున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహతో పాటు తన కూతురు త్రిషకు , అంజన్ కుమార్ యాదవ్ తనతో పాటు కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్లు ఇవ్వాలని ఆశిస్తున్నారు.
Also Read : Asaduddin Owaisi : కేసీఆర్ సీఎం కావడం ఖాయం
