కర్ణాటక మాజీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. మొత్తం 224 సీట్లకు గాను తమ పార్టీకి 130 సీట్లకు పైగానే వస్తాయని ఆయన జోష్యం చెప్పారు. మే 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని పేర్కొన్నారు.
నా స్వంతూరు వరుణ నియోజకవర్గంలోకి వస్తోంది. అందుకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. తాను ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉంటానన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఉండే ఏ పదవులను తాను స్వీకరించ బోనంటూ ప్రకటించారు సిద్దరామయ్య.
పార్టీ హై కమాండ్ ఇప్పటికే ప్రకటించింది. పోటీ చేసేందుకు నాకు ఆసక్తి లేదన్నారు. కానీ కోలార్ ప్రజలు తనను అక్కడి నుండి పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్వంతంగా అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు.
ఈసారి ఎలాగైనా బీజేపీ ఓటమి పాలవడం ఖాయమన్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారి పోయిన ఈ సర్కార్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు మాజీ సీఎం సిద్దరామయ్య. కన్నడిగుల ప్రయోజనాలను కాపాడడంలో సీఎం బొమ్మై విఫలమయ్యారంటూ ఆరోపించారు.