Congress Win : తెలంగాణలో హస్తం హవా
ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే
Congress Win : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. పలు సర్వే సంస్థలు ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటిస్తున్నారు. కొందరు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టనుందని స్పష్టం చేస్తే మరికొందరు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపొందడం ఖాయమని జోష్యం చెబుతున్నాయి.
Congress Win From Survey Reports
తాజాగా దేశంలో ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కుండ బద్దలు కొట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. పూర్తిగా బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని పేర్కొంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొంది.
బీఆర్ఎస్ 9 శాతం ఓట్లను కోల్పోయి 2వ స్థానానికి పరిమితం అవుతుందని స్పష్టం చేసింది ఇండియా టుడే. మొత్తం కాంగ్రెస్(Congress) పార్టీకి 54 స్థానాలు వస్తాయని , బీఆర్ఎస్ కేవలం 49 సీట్లతోనే సరి పెట్టుకుంటుందని వెల్లడించింది. 2018లో 28 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ ఈసారి 38 శాతం ఓట్లను పొందనుందని తెలిపింది.
ఇక పవర్ లోకి రావాలని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమై పోతుందని పేర్కొనడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Tirumala Swarna Ratham : స్వర్ణ రథం శ్రీవారి దర్శనం